RRR సినిమా నుంచి ‘రామమ్… రాఘవమ్’ పాట విడుదల

RRR చిత్ర యూనిట్ రైజ్ ఆఫ్ రామ్ పాటను ఇటీవల విడుదల చేసింది. రామ్ చరణ్ ఈ పాటలో అల్లూరి సీతారామ రాజు లుక్ లో కనిపిస్తారు. సంస్కృత పదాలతో సాగే ఈ పాటను సీనియర్ రైటర్ కె.శివ దత్తా రాశారు. విజయ్ ప్రకాశ్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ ఆలపించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ హీరోలుగా నటించిన ఈ సినిమాను అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.